తెలంగాణ

telangana

ETV Bharat / state

KRMB Meeting Update : వర్చువల్​గా కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం.. హాజరుకాని తెలంగాణ ఈఎన్​సీ - KRMB Meeting Update

KRMB Meeting Meeting Today : కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఇవాళ వర్చువల్ విధానంలో జరిగింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ఈఎన్​సీ మురళీధర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. తమ విజ్ఞప్తి మేరకు నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ ఈఎన్‌సీ కోరగా.. తెలంగాణ ఈఎన్‌సీ గైర్హాజరు దృష్ట్యా బోర్డు ఛైర్మన్‌తో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి మాట్లాడుతానన్నారు.

Krishna River management board meeting
Krishna River management board meeting

By

Published : Jul 18, 2023, 6:55 AM IST

Updated : Jul 18, 2023, 8:37 PM IST

Krishna River Management Board Meeting Today : నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల అంశంపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశానికి తెలంగాణ హాజరు కాలేదు. వర్చువల్ విధానంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఇవాళ మధ్యాహ్నం జరిగింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ వర్చువల్ సమావేశానికి హాజరు కాలేదు.

Telangana ENC not Attends KRMB Meeting : తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాల్వకు ఐదు టీఎంసీల నీరు విడుదల చేయాలని ఏపీ ఇప్పటికే కృష్ణా బోర్డును కోరింది. తమ విజ్ఞప్తి మేరకు నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శిని కోరారు. తెలంగాణ గైర్హాజరు నేపథ్యంలో బోర్డు ఛైర్మన్​తో మాట్లాడతానని బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే చెప్పినట్లు సమాచారం.

Discussion On Nagarjunasagar Water Release : ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభమై 45 రోజులు పూర్తైనప్పటికీ నదుల్లోకి పెద్దగా ప్రవాహాలు లేవు. గోదావరిలో కొంత మేర ఉన్నప్పటికీ కృష్ణాలో మాత్రం పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఇప్పటి వరకు ఎగువ నుంచి ప్రవాహాలు లేవు. ఉపనది తుంగభద్ర నుంచి కూడా ఆశించిన మేర నీరు కృష్ణాలోకి చేరడం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లోకి ఇప్పటి వరకు నీరు చేరలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న ఉమ్మడి జలాశయాల్లో నీటిమట్టం కనీస స్థాయిలోనే ఉంది.

శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 33 టీఎంసీలు మాత్రమే ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీరు ఉన్న స్థాయి 809 అడుగులు మాత్రమే. నాగార్జునసాగర్జలాశయం పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ కేవలం 145 టీఎంసీలు మాత్రమే. జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 518 అడుగుల వద్దే నీటి మట్టం ఉంది. నిరుడు రెండు రాష్ట్రాలు పోటీ పడి దిగువకు వదలడంతో రెండు జలాశయాల్లో కనీస నీటిమట్టం మిగిలిపోయింది. రెండు జలాశయాల్లోకి ఈ ఏడాది ఇప్పటికి నీరు చేరలేదు.

ఎగువ నుంచి ప్రవాహాలు ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో కృష్ణాపై ఆధారపడ్డ సాగు, తాగు నీటి అవసరాలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే నేతృత్వంలో వర్చువల్ విధానంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. కానీ ఈ సమావేశానికి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొనగా.. తెలంగాణ ఈఎన్‌సీ హాజరుకాలేదు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 18, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details