కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తాజా వార్తలు
18:40 May 24
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా
రేపు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరు కాలేమన్న ఆంధ్రప్రదేశ్ సభ్యుల విజ్ఞప్తితో బోర్డు సమావేశాన్ని వాయిదా వేసింది. వివిధ అంశాలపై చర్చించేందుకు రేపు బోర్డు 13వ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే యాస్ తుపాను పొంచి ఉండడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనుల దృష్ట్యా రేపటి సమావేశానికి హాజరు కాలేమని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి బోర్డుకు లేఖ రాశారు.
జూన్ మొదటి వారంలో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో రేపటి బోర్డు సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. తదుపరి సమావేశ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఈటల కుమారుడి భూకబ్జా ఆరోపణలపై అధికారుల విచారణ షురూ