తెలంగాణ

telangana

ETV Bharat / state

KRISHNA BOARD MEETING: నేడు కృష్ణాబోర్డు సమావేశం - కృష్ణాబోర్డు సమావేశం

కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్వహణ చేపట్టే ప్రాజెక్టుల విషయమై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రాజెక్టులను మాత్రమే బోర్డు పరోధిలోకి తీసుకోవాలని రాష్ట్రాలు కోరుతున్న పరిస్థితుల్లో బోర్డు ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది (KRISHNA BOARD MEETING). మొత్తం 30 కేంద్రాలు బోర్డు పరిధిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Krishna board
Krishna board

By

Published : Oct 12, 2021, 4:58 AM IST

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది(KRMB MEETING). కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీసింగ్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధ వేదికగా జరగనున్న సమావేశంలో బోర్డు సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు పాల్గొననున్నారు (KRISHNA BOARD MEETING). కేంద్ర జలశక్తిశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette notification) ఈ నెల 14వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉంది. దీంతో గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై ఇవాళ్టి బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన ప్రాజెక్టుల విషయమై కేఆర్ఎంబీ సభ్యుడు ఆర్కేపిళ్లై(rk Pelly) నేతృత్వంలోని ఉపసంఘం కసరత్తు చేసింది. ఆదివారం కూడా ఈ విషయమై చర్చించారు.

పూర్తి సమాచారం అందుతుందా..?

నోటిఫికేషన్ షెడ్యూల్​లో పేర్కొన్న అన్ని ప్రాజెక్టుల వివరాలు, సమాచారం ఇవ్వాలని బోర్డు రెండు రాష్ట్రాలకు సూచించింది. అయితే ఉమ్మడి ప్రాజెక్టులను మాత్రమే తీసుకోవాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నాయి. మొత్తం 60 కేంద్రాలకు గాను 30 కేంద్రాల వివరాలు, సమాచారం కేఆర్ఎంబీకి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్​కు చెందిన 22, తెలంగాణకు చెందిన ఎనిమిది కేంద్రాలు ఉన్నాయి.

వాటి విషయంలో తేలని పంచాయితీ..

జూరాలను కూడా బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ కోరుతుండగా... తెలంగాణ మాత్రం విభేదిస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ (Nagarjuna sagar) జలవిద్యుత్ కేంద్రాలను కూడా బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ అంటోంది. తెలంగాణ మాత్రం విద్యుత్ కేంద్రాలతో సంబంధం లేదని అంటోంది. విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన వివరాలను అందించకపోవడంపై కేఆర్ఎంబీ ఉపసంఘం(krmb sub committee) కన్వీనర్ ఆర్కేపిళ్లై ఆదివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కీలకంగా మారింది. రెండు రాష్ట్రాల అధికారులతో చర్చించి బోర్డు పరిధిలోకి తీసుకొనే ప్రాజెక్టుల విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:GRMB meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

ABOUT THE AUTHOR

...view details