తెలంగాణ

telangana

ETV Bharat / state

KRMB MEETING: ముగిసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం - krmb meeting

KRMB MEETING
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం

By

Published : Sep 30, 2021, 2:58 PM IST

Updated : Sep 30, 2021, 6:16 PM IST

14:55 September 30

గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చించిన ఉపసంఘం

హైదరాబాద్​లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(Krishna river management board- KRMB) ఉపసంఘం(KRMB subcommittee meeting) సమావేశం ముగిసింది. బోర్డు సభ్యుడు ఆర్​.కె.పిళ్లై నేతృత్వంలో ఉపసంఘం సమావేశమైంది. గెజిట్​ నోటిఫికేషన్(gazette notification) అమలు కార్యాచరణపై సమావేశంలో అధికారులు చర్చించారు. భేటీలో బోర్డు సభ్యులు, ఇరు తెలుగు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. కేఆర్​ఎంబీ ఉపసంఘం సమావేశం ఈ నెల 28న జరగాల్సి ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో గులాబ్​ తుపాను కారణంగా భేటీ వాయిదా పడింది. తుపాను తీవ్రత తగ్గడంతో అధికారులు ఈ రోజు సమావేశమయ్యారు.  

ప్రాజెక్టుల నిర్వహణ వివరాలు ఇవ్వాలని గత సమావేశంలో రెండు రాష్ట్రాలను కేఆర్ఎంబీ(KRMB subcommittee meeting) కోరింది. గతంలో జరిగిన సమావేశంలో 10 రోజుల్లోగా వివరాలివ్వాలని స్పష్టం చేసింది. రూ.కోటికి పైగా విలువ ఉన్న కాంట్రాక్టుల వివరాలు సమర్పించాలని పేర్కొంది. అన్ని అంశాలు పూర్తయ్యాక సీఆర్పీఎఫ్‌పై చర్చ ఉంటుందని వెల్లడించింది. బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ బోర్డు పరిధిలోకి రాదని ఏపీ వాదించింది. బానకచర్ల కూడా బోర్డు పరిధిలోనే ఉండాలని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ విషయంపై అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని ఉప సంఘం కన్వీనర్ పిళ్లై తెలిపారు.  

కేంద్రం గెజిట్ అమలుపై ఉపసంఘం  

కేంద్రం జారీ చేసిన గెజిట్​ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ, రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన సమాచారం, వివరాలు, సంబంధిత అంశాలపై కేఆర్​ఎంబీ(KRMB subcommittee meeting)  సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ ఉప సంఘాల మొదటి సమావేశం ఇటీవలే జలసౌధలో జరిగింది. బోర్డు సభ్యులు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, జెన్​కో అధికారులు ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. 

ఇదీ చదవండి:Ktr on Taiwan investments: భారత్​- తైవాన్​ భాగస్వామ్యానికి హైదరాబాద్​లో పునాది: కేటీఆర్​

Last Updated : Sep 30, 2021, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details