krishna board meeting: కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. తెలుగురాష్ట్రాల తాగు, సాగు అవసరాలకు నీటి విడుదలపై చర్చ జరిగింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి భేటీలో పాల్గొన్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకు వినియోగించుకున్న జలాల వివరాలను సమీక్షించినట్లు సమాచారం.
krishna board meeting: యాసంగి సీజన్‌పై వచ్చే సమావేశంలో చర్చకు అంగీకారం - కేఆర్ఎంపీ సమావేశం
11:47 December 09
ముగిసిన కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం
వచ్చే యాసంగి సీజన్ గురించి చర్చించాలని ఈఎన్‌సీ మురళీధర్ ప్రతిపాదించగా... ఏపీ సానుకూలంగా స్పందించింది. వచ్చే నెల మొదటివారంలో మరోసారి త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. ఆ సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.
ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాల కోసం నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వివరాలు, తదితర అంశాలపై కూడా చర్చకొచ్చాయి.
ఇదీ చూడండి:TS Letter to Krishna Board: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ