నిధుల లేమితో ఇబ్బంది పడుతున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు Krishna, Godavari River Management Board : రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను(Krishna Godavari River Management Board) ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నదీ జలాలకు సంబంధించిన అంశాల కోసం ఈ బోర్డులను ఏర్పాటు చేశారు. బోర్డులకు రెండు రాష్ట్రాల నుంచి సిబ్బందితో పాటు నిధులు కూడా సమకూర్చాల్సి ఉంది. ప్రతి ఏటా బోర్డు సమావేశాల్లో బడ్జెట్ ఖరారు చేసి, అందుకు అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రెండు రాష్ట్రాల నుంచి బోర్డులకు సకాలంలో నిధులు అందడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధుల విషయమై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 12న ప్రత్యేకంగా సమావేశం కానుంది.
సాగుకు కలిసిరాని కాలం - యాసంగికి కాడి వదిలేసిన అన్నదాత
River Management Boards :వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సమావేశం జరగనుంది. కృష్ణా బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.45.63 కోట్ల నిధులు రాగా, రూ.45.45 కోట్లు ఖర్చు చేశారు. అందులో ఏపీ ఇచ్చిన మొత్తం 24.91 కోట్ల రూపాయలు కాగా తెలంగాణ ఇచ్చిన మొత్తం 19.71 కోట్ల రూపాయలు. కేంద్రం ఇచ్చిన కోటి రూపాయల కార్పస్ ఫండ్ కూడా ఇందులో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ 13.61 కోట్ల రూపాయలు, ఏపీ 11.75 కోట్లు బోర్డుకు ఇవ్వాల్సి ఉంది. మే నెలలో ఏపీ ప్రభుత్వం 3.35 కోట్ల రూపాయలు ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బోర్డు బడ్జెట్‌ను 23.5 కోట్లు రూపాయలుగా ఖరారు చేశారు.
krmb:ఈ నెల 12న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం
గోదావరి నదీ యాజమాన్య బోర్డు : అందులో వేతనాల కోసం చెల్లించాల్సిన మొత్తం 12.7 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే నెలకు కోటి రూపాయలకు పైగా వేతనాల కోసం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోర్డు వద్ద కేవలం 22 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ మొత్తంతో జనవరి నెల వేతనాలను చెల్లించే పరిస్థితి లేదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలిపింది. బోర్డుకు సకాలంలో నిధులు చెల్లించే అంశంపై 12న జరగనున్న సమావేశంలో చర్చించాలని ఎజెండాలో పొందుపరిచారు. ఇక గోదావరి బోర్డుకు సంబంధించి రెండు రాష్ట్రాల నుంచి నిధులు రావడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా తెలంగాణ నుంచి ఐదు కోట్ల వరకు రావాల్సి ఉన్నట్లు సమాచారం.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు :జీఆర్ఎంబీ వార్షిక బడ్జెట్ 16 కోట్ల రూపాయలు కాగా సమయానికి రెండు రాష్ట్రాల నుంచి నిధులు రాకపోవడంతో రిజర్వ్ నిధుల నుంచి ఉద్యోగుల జీతాలు చెల్లిస్తోంది. గోదావరి బోర్డు ప్రతి నెలా దాదాపు 50 లక్షల రూపాయలకు పైగా వేతనాల కోసం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గోదావరి బోర్డు వద్ద మిగిలిన రిజర్వ్ నిధులు మరో నాలుగు నెలల వేతనాల కోసం మాత్రమే సరిపడతాయని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నదీ యాజమాన్య బోర్డులతో కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు, సభ్యకార్యదర్శులు సమావేశానికి హాజరు కానున్నారు.
రెండు బోర్డుల ప్రతినిధులు నిధుల అంశాన్ని సమావేశంలో ప్రస్తావించనున్నారు. దాంతో పాటు బోర్డుకు సంబంధించిన ఇతర అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్రం గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనం, బోర్డు కార్యాలయాలు, వసతులు, కృష్ణా బోర్డు ఏపీకి తరలింపు సహా ఇతర అంశాలు కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి.
Central Govt Focus on Krishna Water Share to AP and Telangana : 'కృష్ణా జలాల్లో.. తెలుగు రాష్ట్రాల వాటా త్వరగా తేల్చండి'
WATER DISPUTES: ఇక వివాదాలు తేల్చాల్సింది ట్రైబ్యునలే!