తెలుగు రాష్ట్రాలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. మే నెలాఖరు వరకు కనీస నీటిమట్టంపై ఇరురాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాలని సూచించింది.
కృష్ణాబోర్డు లేఖ
By
Published : Mar 1, 2019, 5:03 PM IST
కృష్ణాబోర్డు లేఖ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. మే నెలాఖరు వరకు అవసరాల కోసం ప్రతిపాదనలు పంపాలని లేఖలో పేర్కొంది. నేటి వరకు నాగార్జునసాగర్‌లో 31.641 టీఎంసీల నీరు ఉందని వెల్లడించింది. శ్రీశైలంలో కనీస నీటి వినియోగ మట్టానికి 4.861 టీఎంసీల దిగువన నీరు ఉందని స్పష్టం చేసింది. జలాశయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాలు ప్రతిపాదనలు ఇవ్వాలని కృష్ణా యాజమాన్య బోర్డు సూచించింది.