కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిని ఖరారు చేసే విషయమై తెలంగాణ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు కృష్ణా బోర్డు కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. బోర్డు పరిధిపై ముందుకెళ్లవద్దని కోరుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ నెల 12న లేఖ రాశారు.
తెలంగాణ అభ్యంతరాలు కేంద్రానికి వెల్లడి - తెలంగాణ అభ్యంతరాలు కేంద్రానికి వెల్లడి
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిని ఖరారు చేసే విషయమై రాష్ట్ర అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. బోర్డు పరిధిపై ముందుకెళ్లవద్దని కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ నెల 12న లేఖ రాశారు.
తెలంగాణ అభ్యంతరాలు కేంద్రానికి వెల్లడి
ట్రైబ్యునల్ ద్వారా ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయకుండా బోర్డు పరిధిని ఖరారు చేయడం తగదని అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు తొందరపడవద్దని కోరారు. తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేంద్ర జలశక్తి శాఖకు బోర్డు నివేదించింది. తెలంగాణ ఈఎన్సీ రాసిన లేఖను ఈ సందర్భంగా జతపరిచారు.
ఇదీ చూడండి:హుస్నాబాద్‌లో వ్యాక్సిన్ కొరత.. నిరాశతో వెనుదిరిగిన వృద్ధులు