తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణానదీ మిగులు జలాలపై నేడు సమావేశం - krishna board latest news today

మిగులు జలాలపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ ఈరోజు భేటీ కానుంది. ఒప్పందానికి మించి నదిలోకి నీరు వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య విధివిధానాలు లేవు. ఆ అంశంపై కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్ నేతృత్వంలో నిర్ణయం తీసుకోనున్నారు.

krishna board river surplus water technical committee Meeting today in hyderabad
కృష్ణా నదీ మిగులు జలాలపై నేడు సమావేశం

By

Published : May 13, 2020, 6:01 AM IST

మిగులు జలాలపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ ఇవాళ సమావేశం కానుంది. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపుల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు 811 టీఎంసీలు కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. అంతకు మించి నీరు వస్తే ఏం చేయాలన్న విషయమై ఇప్పటి వరకు విధివిధానాలు లేవు. 2019-20లో కృష్ణాకు భారీగా వరద వచ్చింది. మిగులు జలాల వినియోగానికి సంబంధించిన ప్రాతిపదిక లేదు. దీనిపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ ఇవాళ సమావేశం కానుంది.

దృశ్య మాధ్యమ సమీక్ష ద్వారా

కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో ఇరు రాష్ట్రాల అంతర్ రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజినీర్లు, సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. బోర్డు సభ్యుడు హరికేష్ మీనా సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఇవాళ సమావేశమై మిగులు జలాల అంశంపై చర్చించనుంది. అయితే కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష సమావేశం కాకుండా దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా సమావేశం జరగనుంది.

ఇదీ చూడండి :రాష్ట్రంలో ఇవాళ 51 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details