రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను కొనసాగించవద్దని కృష్ణానదీ యాజమన్య బోర్డు మరోమారు ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టం చేసింది. డీపీఆర్ సమర్పించకుండా... అత్యున్నత మండలి అనుమతి లేకుండా... ముందుకెళ్లొద్దని తెలిపింది. ఎలాంటి అనుమతులు లేకుండా...... జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారని.. తెలంగాణ సర్కార్ చేసిన ఫిర్యాదుపై బోర్డు స్పందించింది. ఈ మేరకు.... కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా.. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశంలో రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టవద్దని చెప్పిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపండి: కృష్ణా బోర్డు - రాయలసీమ ఎత్తిపోతల పథకం తాజా వార్తలు
సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సమర్పించి, ఆమోదం పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదేశించింది. అంతవరకు పనులు ఆపాలని బోర్డు తరఫున సభ్యుడు హెచ్‌కే మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల కార్యదర్శికి బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల వాస్తవ స్థితి పరిశీలించేందుకు వస్తామన్న బోర్డు బృందాన్ని... వివిధ కారణాలతో అనుమతించలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే ఏపీ అక్రమంగా ప్రాజెక్టు పనులను కొనసాగిస్తోందని తెలంగాణ ఫిర్యాదు చేసిందన్న బోర్డు... పనులకు సంబంధించిన కొన్నిచిత్రాలను జత చేసిందని పేర్కొంది. ప్రాజెక్ట్ ప్రాంతాన్ని కృష్ణా బోర్డు బృందం పరిశీలించేందుకు........ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోవడంతో అక్కడ ఎన్జీటీ ఆదేశాల ఉల్లంఘన జరుగుతుందా లేదా అనే విషయమై ఒక అభిప్రాయానికి రాలేకపోయినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో.. డీపీఆర్ సమర్పించకుండా అత్యున్నతమండలి ఆమోదం లేకుండా..... పనులు కొనసాగించవద్దని బోర్డు కోరింది.
ఇదీ చదవండి:నేడు కశ్మీర్ నేతలతో మోదీ కీలక భేటీ