తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం - నేడే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

నిన్న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నేటికి వాయిదా పడింది. జలసౌధ వేదికగా బోర్డు ఛైర్మన్ ఆర్కే గుప్తా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.

krishna board meeting at hyderabad
నేడే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

By

Published : Jan 9, 2020, 5:26 AM IST

Updated : Jan 9, 2020, 8:04 AM IST

బోర్డు ఛైర్మన్ ఆర్కే గుప్తా ఆధ్వర్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నేడు జరగనుంది. నిన్న జరగాల్సిన భేటి వాయిదా పడగా... దానిని నేడు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు, బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం పాల్గొంటారు. కేంద్ర జల్​శక్తి మంత్రిత్వశాఖ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. బోర్డు ప్రధాన కార్యాలయం తరలింపు, జలాల సరిహద్దులతో పాటు ప్రధానంగా 4 అంశాలను చర్చింనున్నట్లు తెలుస్తోంది.


ఈ సమీక్షలో ప్రధానమైన 4 అంశాలతో పాటు కొత్తగా రెండు అంశాలను రెండు రాష్ట్రాలు లేవనెత్తే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చెన్నై తాగునీటి విడుదల అంశాన్ని కూడా బోర్డు పరిధిలోకి చేర్చాలని... తెలంగాణ వరదల సమయంలో వినియోగించుకుంటున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దని... ఏపీ బోర్డు ఛైర్మన్​ అనుమతితో ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు అజెండాలో చేర్చిన కేఆర్​ఎంబీకి నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాల నడుమ నదీ జలాల పంపిణీ, 10వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై తీర్మానం. బోర్డును ఏపీ రాజధానికి తరలింపు వంటి అంశాలపై చర్చించనున్నారు.

ఇవీ చూడండి: పార్టీ మారనని బాండ్​ రాసిస్తేనే బీ ఫారం...!

Last Updated : Jan 9, 2020, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details