ETV Bharat / state
తెలంగాణకు కృష్ణా యాజమాన్య బోర్డు లేఖ - water
సాగర్ ఆయకట్టు, తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కృష్ణా యాజమాన్య బోర్డుకు ఏపీ జలవనరుల శాఖ లేఖ రాసింది. ఏపీ 17 టీఎంసీల నీటిని కోరినందున తెలంగాణ కూడా తమ ప్రతిపాదనలు పంపాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి తెలంగాణ జలవనరుల శాఖకు లేఖ రాశారు.


తెలంగాణకు కృష్ణా యాజమాన్య బోర్డు లేఖ
By
Published : Mar 12, 2019, 6:52 AM IST
| Updated : Mar 12, 2019, 9:51 AM IST
తెలంగాణకు కృష్ణా యాజమాన్య బోర్డు లేఖ మే నెల వరకు తాగునీటి అవసరాలతో పాటు సాగర్ ఆయకట్టు కోసం 17 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర రావు లేఖ రాశారు. ఏపీ లేఖ నేపథ్యంలో కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి హరికేష్ మీనా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ 17 టీఎంసీల నీరు కోరినందున తెలంగాణ నీటి అవసరాలు ఉంటే వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖను కూడా జతపరిచారు. Last Updated : Mar 12, 2019, 9:51 AM IST