తెలంగాణ

telangana

ETV Bharat / state

క్యారీ ఓవర్‌ నీటిపై ఆంధ్రప్రదేశ్​కు లేఖ రాసిన కృష్ణా బోర్డు - latest uopdate krishna board

రిజర్వాయర్లలో నిల్వ ఉంచుకొన్న (క్యారీ ఓవర్‌) నీటిని ప్రస్తుత ఏడాది వాడుకోవడంపై అభిప్రాయం చెప్పాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్‌ను కోరింది.

krishna-board-letter-to-ap-on-carry-over-water
క్యారీ ఓవర్‌ నీటిపై ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

By

Published : Jun 20, 2020, 6:37 AM IST

గత సంవత్సరంలో కేటాయించిన కోటా.. వినియోగించుకోకుండా రిజర్వాయర్లలో నిల్వ ఉంచుకొన్న (క్యారీ ఓవర్‌) నీటిని ప్రస్తుత ఏడాది వాడుకోవడంపై అభిప్రాయం చెప్పాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్‌ను కోరింది. 75 శాతం లభ్యత సంవత్సరాల్లో నీరు ఎక్కువగా వచ్చినప్పుడు నిల్వ చేసుకొని తక్కువ లభ్యత ఉండే 25 శాతం సంవత్సరాల్లో వాడుకోవడానికి బచావత్‌ ట్రైబ్యునల్‌ అవకాశం కల్పించిందని.. దీని ప్రకారం ప్రస్తుతం అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీని కోరింది.

ఈ అంశంపై గతంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ, ఇటీవల జరిగిన కృష్ణా బోర్డు భేటీలోనూ చర్చించారు. దీనిపై వారం రోజుల్లో అభిప్రాయం చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ను బోర్డు కోరింది. అయినా, ఏపీ నుంచి సమాధానం రాకపోవడంతో తాజాగా బోర్డు సభ్యకార్యదర్శి ఎల్‌.బి.మౌంతంగ్‌ ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు లేఖ రాశారు.

ఇదీ చదవండి:ఇదీ చూడండి:యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details