విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గత నెల 15వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ వైఖరి వెల్లడించలేదు. రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని... సందర్భం వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కృష్ణాజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దాదాగిరీ చేస్తోందని, కేంద్రం కూడా తెలంగాణకు అన్యాయం చేసే దిశగా వెళ్తోందని హాలియా సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు.
హాజరు కాని తెలంగాణ
అటు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ కార్యాచరణను వేగవంతం చేశాయి. బోర్డులకు నిధులు ఇవ్వాలని, ప్రాజెక్టులు, సంబంధిత వివరాలు ఇవ్వాలని ఇప్పటికే రెండు రాష్ట్రాలకు లేఖలు రాశాయి. అమలు కార్యాచరణ ఖరారు కోసం రెండు బోర్డులు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి మొదటి భేటీని కూడా నిర్వహించాయి. అయితే ముందే పూర్తి స్థాయి బోర్డును సమావేశపరచాలని కోరిన తెలంగాణ.. సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కాలేదు.
కుదరదన్న తెలంగాణ