విద్యార్థుల కేరింతలు, నృత్యాలతో హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలు హోరెత్తాయి. గత విద్యా సంవత్సరంలో 29 విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పథకం, నగదు బహుమతులను అందజేశారు.
అదిరేటి స్టెప్పులు.. ఆలోచింపజేసే నాటికలు - కోఠి ఉమెన్స్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకల వార్తలు
క్లాసికల్, ఫోక్, వెస్టర్న్ డాన్సులతో కోఠి ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులు అదరగొట్టారు. పలు సామాజిక అంశాలతో చేసిన నాటికలు ఆలోచింపజేశాయి. విద్యార్థుల కేరింతలు, నృత్యాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. గతేడాది ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులతో కళశాల యాజమాన్యం ప్రోత్సహించింది.

అదిరేటి స్టెప్పులు.. ఆలోచింపజేసే నాటికలు
విద్యార్థులను బహుమతులతో ప్రొత్సహిస్తే విద్యార్థులు ప్రేరణ పొందుతారని ప్రిన్సిపల్ రోజారాణి తెలిపారు. విద్యతో పాటు అన్ని రంగాలలో విద్యార్థులు రాణించేందుకు ఈ తరహా కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. విద్యార్థులు చేసిన క్లాసికల్, ఫోక్, వెస్టర్న్ డాన్సులు, పలు సామాజిక అంశాలపై చేసిన నాటికలు ఆకట్టుకున్నాయి.
అదిరేటి స్టెప్పులు.. ఆలోచింపజేసే నాటికలు
ఇదీ చూడండి:జగిత్యాలలో ఓ యువకునికి కరోనా లక్షణాలు
TAGGED:
koti womens college news