Kothapeta TIMS is the Tallest Govt Hospital in India :హైదరాబాద్‌లో కొత్తపేట పండ్ల మార్కెట్ స్ధలంలో నిర్మిస్తున్న టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) దేశంలోనే ఎత్తయిన ప్రభుత్వ ఆసుపత్రిగా నిలవనుంది. 11.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ ఆసుపత్రిని 123 మీటర్ల ఎత్తు.. 27 అంతస్తుల్లో నిర్మించనున్నారని తెలిసింది.
దేశంలోనే ఎత్తైన ప్రభుత్వ ఆస్పత్రిగా కొత్తపేట 'టిమ్స్' - Kothapeta TIMS hospital news
Kothapeta TIMS is the Tallest Govt Hospital in India : దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి నిర్మిస్తోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరుతో నగరంలో కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలంలో 123 మీటర్ల ఎత్తుతో 27 అంతస్తుల్లో ఈ భవనం రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం.
Kothapeta TIMS
దేశంలో ప్రైవేటులోనూ ఇంత ఎత్తైన ఆసుపత్రి లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. సంబంధిత భవన నమూనా ఒకటి తాజాగా బయటకు వచ్చింది. రూ.668 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి నిర్మాణ టెండరును ఇటీవల ఎల్ అండ్ టీ దక్కించుకున్న విషయం విదితమే. టిమ్స్ పేరుతో ఎల్బీనగర్‌తో పాటు అల్వాల్, సనత్‌నగర్‌లలో ఒక్కోటి వేయి పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.