రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నందున గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ కమిటీ సభ్యులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్‌ను మూసివేయనున్నట్లు కమిటీ ఛైర్మన్ వీరమళ్ల రాంనర్సింహగౌడ్ వెల్లడించారు.
రేపట్నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్ బంద్ - kothapet fruit market to be closed
హైదరాబాద్‌లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కొత్తపేట పండ్ల మార్కెట్‌ను బుధవారం నుంచి పూర్తిగా మూసివేస్తున్నట్లు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ కమిటీ వెల్లడించింది.
రేపట్నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్ మూసివేత
రైతులు మార్కెట్‌కు వచ్చి అనవసరంగా ఆరోగ్యాన్ని పాడుచేసుకోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ ఛైర్మన్ తెలిపారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆదేశానుసారం మార్కెట్‌ను పూర్తి స్థాయిలో మూసివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Last Updated : Apr 21, 2020, 11:29 PM IST