ఏటా దేశంలోని రెండు మూడు రాష్ట్రాలను ఎంచుకుని స్థానిక కొరియా రాయబార కార్యాలయం ఏర్పాటు చేసే కారవాన్ కార్యక్రమానికి ఈసారి తెలంగాణను ఎంచుకుంది. 48 మందితో కూడిన బృందం పెట్టుబడి అవకాశాలు, రాష్ట్రంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు పర్యటిస్తోంది. కొరియా ప్రతినిధి బృందం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమాశమైంది. రాష్ట్రానికి వచ్చే దక్షిణ కొరియా పెట్టుబడులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
మొదటి స్థానంలో
భారతదేశంలోనే తెలంగాణ సరళతర వాణిజ్య విధానంలో మొదటి స్థానంలో ఉందని, దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. భారత్ అత్యధిక వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ఇక్కడి భారీ మార్కెట్లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటామని బృంద సభ్యుడు షిన్ బొంగ్ కిల్ తెలిపారు. అనేక కొరియా కంపెనీలు ఇక్కడికి పెట్టుబడులతో తరలివస్తున్నాయని చెప్పారు.
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం: కేటీఆర్ ఇదీ చూడండి : మహానగరంలో సీజన్ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదు