కాళేశ్వరం ప్రాజెక్టు 14వ ప్యాకేజీలోని అక్కారం, మర్కూక్ పంపుహౌస్‌లను, కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని పలు నిర్మాణ సంస్థలు లక్ష్యం మేరకు పూర్తిచేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత భారీ సాగు విస్తీర్ణం ఉన్నది ఈ జలాశయం పరిధిలోనే కావడం విశేషం. లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) వద్ద వంద అడుగుల స్థాయి నుంచి బయలుదేరిన గోదావరి 214 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 618 మీటర్ల ఎత్తుకు చేరుకుంది.
లాక్‌డౌన్‌లో వేగంగా పనులు
వానాకాలం లోపే కొండపోచమ్మ సాగర్‌కు గోదావరి జలాలను తీసుకురావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ, రెండు పంపుహౌస్‌లు నిర్మించిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ కలిసికట్టుగా పనులను పరుగెత్తించాయి. విద్యుత్తు మోటార్లు, పంపుహౌస్‌ల్లో సాంకేతిక పనులకు సంబంధించి... ఆన్‌లైన్ ద్వారా విదేశాల్లోని నిపుణులను సంప్రదిస్తూ పూర్తిచేశారు. ముంబయి నుంచి రావాల్సిన విద్యుత్తు ఇంజినీర్లను ప్రత్యేక అనుమతుల ద్వారా తీసుకొచ్చి పంపుహౌస్‌ల పనులను పూర్తి చేశారు. జలాశయం పనులను కేఎన్‌ఆర్, హెచ్‌ఈఎస్ ఇంజినీరింగ్ సంస్థలతో పాటు కొన్ని పనులను ఏఎన్‌ఆర్ సంస్థ చేపట్టింది.
అక్కారం, మర్కూక్ పంపుహౌస్‌ల నిర్మాణ వ్యయం: రూ.2100 కోట్లు