కొండ లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి సందర్భంగా హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని రాజలింగయ్య కబడ్డీ స్టేడియం వద్ద ఆయన చిత్రపటానికి నాంపల్లి భాజపా ఇన్ఛార్జ్ దేవర కరుణాకర్ నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో పోరాటం చేసిన మహానేతని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలు - latest news of laxman bapuji birth anniversary celebrations in hyderabad
హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలను భాజపా శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఇల్లును కూడా కార్యాలయంగా మార్చి ప్రజలకోసం నిర్విరామ కృషిచేసిన ఆయన చేసిన సేవలు ఎనలేనివని గుర్తుచేసుకున్నారు.
![ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలు konda laxman bapuji 105th birth anniversary celebrations in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8958934-829-8958934-1601206752734.jpg)
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలు
తన సొంత ఇల్లును కార్యాలయం కోసం దానం చేశారని.. ఆయనో గొప్ప గాంధేయవాది అని, బీద బడుగు బలహీన వర్గాల నేతని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అశోక్‌యాదవ్, అన్ను యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కొండా లక్ష్మణ్ సేవలు ఎనలేనివి: ఎర్రబెల్లి
TAGGED:
కొండా లక్ష్మణ్ బాపు జయంతి