తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్‌ బాపూజీ' - Konda_Papugi_Jayanti_Celebrations_

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తప్ప తనకు ఏ పదవీ వద్దని చివరి శ్వాస వరకు పోరాడిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని మంత్రులు మహమూద్‌ అలీ, గంగుల కమలాకర్‌ అన్నారు. రవీంద్రభారతిలో కొండా లక్ష్మణ్​ బాపూజీ 104వ జయంతి వేడుకలు ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించారు.

ఘనంగా కొండా లక్ష్మణ్​ బాపూజీ 104 జయంతి వేడుకలు

By

Published : Sep 27, 2019, 5:24 PM IST

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్​ బాపూజీ 104 జయంతి వేడుకలు

తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని.. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని మంత్రులు మహమూద్​ అలీ, గంగుల కమలాకర్​ అన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ 104 జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్‌ అలీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, పలువురు ఐఏఎస్‌ అధికారులు, బీసీ సంఘాల నాయకులు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి నివాళి అర్పించారు. బీసీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని మంత్రులు పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని బీసీ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details