లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు సహాయం చేయడానికి పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. ఉపాధి లేక.. తిండికి ఇబ్బందులు పడుతున్న వారికి కొందరు నిత్యావసరాలు అందిస్తే.. మరికొందరు భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
వలస కూలీలకు ఆహారం అందించిన కౌన్సిలర్ - ఆహారం అందజేత
లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు ప్రభుత్వం స్వస్థలాలకు చేరవేస్తుంది. బస్సుల్లో స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలకు పలువురు దాతలు బస్సులు ఆపి.. భోజనం అందిస్తున్నారు. కొంపల్లిలోని ఆర్టీసీ బస్సుల్లో తరలి వెళ్తున్న వారికి కౌన్సిలర్ జ్యోత్స్న శివారెడ్డి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
వలస కూలీలకు ఆహారం అందించిన కౌన్సిలర్
ప్రభుత్వం బస్సుల్లో తరలిస్తున్న వలస కూలీలకు కౌన్సిలర్ జ్యోత్స్న శివారెడ్డి బస్సులు ఆపి ఆహార పొట్లాలు అందించారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి పేదలకు, వలస కార్మికులకు తమ వంతు సాయం చేస్తున్నట్టు కౌన్సిలర్ తెలిపారు.
ఇదీ చూడండి: పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే!