తెలంగాణ

telangana

ETV Bharat / state

కావాలని కక్ష సాధించం కానీ - మా మొదటి ప్రాధాన్యత అదే : మంత్రి కోమటిరెడ్డి - రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి

Komatireddy Venkatreddy Takes Charges As Telangana R&B Minister : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం తొమ్మిది దస్త్రాలపై సంతకాలు చేశారు. కావాలని ఎవరిపైనా కక్ష సాధించమని కానీ తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు రోడ్ల నిర్వహణే తమ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

Komatireddy Venkatreddy as Cinematography Ministry
Komatireddy Venkatreddy taking R&B Ministry

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 2:06 PM IST

కావాలని కక్ష సాధించం కానీ - మా మొదటి ప్రాధాన్యత అదే : మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkatreddy Takes Charges As Telangana R&B Minister :గత పదేళ్లుగా బీఆర్​ఎస్​ ప్రభుత్వం రోడ్లమీద శ్రద్ధ పెట్టలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విమర్శించారు. ఈరోజు సచివాలయంలో తన ఛాంబర్​లో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం 9 దస్త్రాలపై సంతకాలు చేశారు. వీటిలో నల్గొండ ముషంపల్లి ధర్మాపురం రోడ్​ 4 లైన్​ వేయడం వంటి అంశాలు ఉన్నాయి.

Komatireddy Venkatreddy On Telangana Roads Development :సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ విషయమై దిల్లీలో సోమవారం రోజున కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీని కలిసి విన్నవిస్తానని తెలిపారు. రాష్ట్రంలో 14 రోడ్​లను నేషనల్ హైవే హోదాకు పెంచాలని, రీజినల్ రింగ్ రోడ్​ సౌత్​ని నేషనల్ హైవేగా గుర్తించాలని, విజయవాడ, హైదరాబాద్ రోడ్​ని 6 లైన్ లకు పెంచాలని, హైదరాబాద్- కల్వకుర్తి రోడ్​ని 4 లైన్ చేయాలని గడ్కరీకి విన్నవిస్తానని చెప్పారు.

ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం : మంత్రి శ్రీధర్​బాబు

"రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తాను. ఈ విషయమై దిల్లీలో రేపు కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీని కలిసి విన్నవిస్తాను. నూతన కౌన్సిల్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆదేశించారు. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో కొత్త కౌన్సిల్ భవన నిర్మాణం ప్రారంభిస్తాము".- కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మంత్రి

సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్​ను పెంచాలని మంత్రి కోమటిరెడ్డి కోరనున్నారు. 9 ఫైల్స్​లో ఐదింటిని సోమవారం రోజున గడ్కరీ గారిని కలిసి అనుమతి కోసం కోరుతానని చెప్పారు. హైదరాబాద్- విజయవాడ రోడ్​లో మల్కాపూర్ వరకు కొంత పని అయిపోయిందని తెలిపారు. మిగిలిన పనిని 6 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండున్నర గంటల్లో చేరుకునేలా రోడ్లను అభివృద్ధి చేస్తామని మిగిలిన వాటిని 2 నుంచి 3 ఏళ్లలో పూర్తి చేస్తామని వివరించారు.

నూతన కౌన్సిల్ భవన నిర్మాణానికిముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanthreddy) ఆదేశించినట్లు వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలో కొత్త కౌన్సిల్ భవన నిర్మాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. 2 రోజుల్లోనే ఏం చేశారని హరీశ్‌రావు మాట్లాడుతున్నారని, 10 ఏళ్లుగా బీఆర్​ఎస్​ నేతలు ఏం చేశారో చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.

మహాలక్ష్మి పథకంతో తెలంగాణ ఆర్టీసీ పుంజుకుంటుంది : సజ్జనార్

యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details