తెలంగాణ

telangana

ETV Bharat / state

Saidabad Rape Case: సైదాబాద్ ఘటనపై స్పందించరా..? కేసీఆర్, కేటీఆర్ ఎక్కడికి పోయారు?: కోమటిరెడ్డి - తెలంగాణ వార్తలు

సైదారాబాద్‌లో చిన్నారి కుటుంబసభ్యులను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటనపై మంత్రులు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం ఉంటే బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి... నిందితుడికి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

Komatireddy Venkat reddy, komatireddy on saidabad incident
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం, సైదారాబాద్‌ ఘటనపై కోమటిరెడ్డి

By

Published : Sep 15, 2021, 12:29 PM IST

Updated : Sep 15, 2021, 1:02 PM IST

ప్రభుత్వంపై కోమటిరెడ్డి ఆగ్రహం

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో బాలికపై హత్యాచార(saidabad incident) ఘటన జరిగిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(mp komatireddy venkat reddy) ఆరోపించారు. ప్రజలకు రక్షణ లేకుంటే... ప్రభుత్వం ఎందుకు ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వం 24 గంటల్లో నిందితుణ్ని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. సైదాబాద్‌లో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన... సీఎం కేసీఆర్(cm kcr), కేటీఆర్‌(ktr), డీజీపీ మహేందర్ రెడ్డి(dgp mahender reddy), సీఎస్‌ సోమేశ్ కుమార్(cs somesh kumar), కమిషనర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.

సింగరేణికాలనీని సింగపూర్‌ చేస్తామని ఎన్నికల సమయంలో కేటీఆర్ హామీ ఇచ్చారని... కానీ ఇప్పుడు ఈ కాలనీ శ్మశానంలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత చిన్నారి కుటుంబాన్ని ఓదార్చడానికి హోంమంత్రి మహమూద్ అలీ(mahmood ali), స్థానిక ఎమ్మెల్యే కూడా రాకపోవడం బాధాకరమని మండిపడ్డారు. సినిమాకు సంబంధించిన వ్యక్తులతో గంటలు గంటలు కూర్చునే మంత్రి తలసాని... ఇక్కడికి ఎందుకు రాలేదని కోమటి రెడ్డి ప్రశ్నించారు. మానవత్వం ఉంటే బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి... నిందితుడికి శిక్ష విధించాలన్నారు. చిన్న పిల్లలకు చాక్లెట్‌ ఆశ చూపినట్లు ఏ ఘటన జరిగినా డబుల్ బెడ్‌ రూం ఇల్లు ఇస్తామంటున్నారని విమర్శించారు. చందాలు వేసుకుని అయినా బాలికలను రక్షించుకుంటామని ఎంపీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:TS HIGH COURT: సాక్షిపై కోర్టు ధిక్కరణ కేసు హైకోర్టుకు బదిలీ

Last Updated : Sep 15, 2021, 1:02 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details