తెలంగాణ

telangana

ETV Bharat / state

నేను కేసీఆర్‌ బొమ్మతో గెలవలేదు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి - మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వార్తలు

గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మునుగోడు కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతుండగా.. తెరాస నేతలు అడ్డుపడటంపై కోమటిరెడ్డి మండిపడ్డారు.

komatireddy speech on governor's speech
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి

By

Published : Mar 7, 2020, 1:53 PM IST

అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి ప్రశాంత్​రెడ్డి అడ్డుపడ్డారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని రాజగోపాల్​రెడ్డి మండిపడ్డారు.

"నేను కేసీఆర్‌ బొమ్మతో గెలవలేదు. ప్రజలు గెలిపిస్తే ఇక్కడికి వచ్చాను. మాట్లాడే గొంతును నొక్కేస్తున్నారు. తొలిగా నేను మాట్లాడుతానని సీఎల్పీ జాబితా ఇచ్చింది. సభలో మాట్లాడే విషయంలోనూ అన్యాయం చేశారు. డబ్బులతో ఎన్నికల్లో గెలిచారు. పురపాలిక ఎన్నికల్లో మేము గెలిచినచోట కూడా మీవాళ్లే ఛైర్‌పర్సన్‌లు అయ్యారు? ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేటప్పుడు అధికార పక్షాలు అడ్డుతగలొద్దు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..!" రాజగోపాల్​ రెడ్డి ప్రభుత్వాన్ని అని దుయ్యబట్టారు.

నేను కేసీఆర్‌ బొమ్మతో గెలవలేదు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఇవీ చూడండి:నేరాలకు మద్యమే కారణం: సీతక్క

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details