Komati Reddy Rajagopal Reddy on KCR: సింగరేణి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రోజగోపాల్ రెడ్డి విమర్శించారు. సింగరేణిపై తెరాస నాయకుల మాటలు నిజం కాదని వెల్లడించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.. ఏ ప్రభుత్వం కూడా ప్రైవేటు పరం చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన టెండర్లలో గోల్మాల్ జరిగిందన్న రాజగోపాల్ రెడ్డి.. ఆ విషయాన్ని నిరూపిస్తానని చెప్పారు. సింగరేణికి చెందిన నైనీ బ్లాకును ప్రైవేటు కంపెనీకి అప్పగించి.. సంస్థకు రూ. 20 వేల కోట్లు నష్టం వాటిల్లేలా తెరాస సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు.
ప్రజలకు తెలుసు
తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకొని తెరాస రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తనకు అన్ని అంశాలపై పట్టుందని సమాధానమిచ్చారు. జీవన్ రెడ్డి స్థాయి, రాజగోపాల్ రెడ్డి స్థాయి ఏంటో ప్రజలకు తెలుసన్నారు.