తెలంగాణ

telangana

ETV Bharat / state

Komatireddy Rajagopal Reddy Fires On CM KCR : మునుగోడు నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి - కేసీఆర్​పై కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ఫైర్​

Komatireddy Rajagopal Reddy
Komatireddy Rajagopal Reddy Fires On CM KCR

By ETV Bharat Telangana Team

Published : Oct 25, 2023, 5:31 PM IST

Updated : Oct 25, 2023, 7:40 PM IST

17:15 October 25

Komatireddy Rajagopal Reddy Fires On CM KCR : మునుగోడు నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

Komatireddy Rajagopal Reddy Fires On CM KCR మునుగోడు నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేస్తా

Komatireddy Rajagopal Reddy Fires On CM KCR : కాంగ్రెస్​ అధిష్ఠానం అవకాశం ఇస్తే మళ్లీ మునుగోడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) స్పష్టం చేశారు. పార్టీ అవకాశం ఇస్తే.. కేసీఆర్​పై పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్​లోని మెయినాబాద్​ ఫాంహౌస్​లో ఆయన అనుచరులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​, కేసీఆర్​లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

"ఈనెల 27న రాహుల్​ గాంధీ సమక్షంలో కాంగ్రెస్(Rajagopal Reddy Join Congress)​లోకి చేరుతున్నాను. ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్​లోకి వెళుతున్నాను. అవినీతి కేసీఆర్​ను గద్దె దించాలంటే కాంగ్రెస్​లో చేరాలని ప్రజలు సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్​లో ఉంటేనే మీరు గెలుస్తారని ప్రజలు నాతో అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ప్రజల నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలి. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుకోవడానికి నేను కేసీఆర్​ను కాదు. అందుకే కాంగ్రెస్​లో మళ్లీ చేరుతున్నా.. ఇదే నా జీవితంలో అతిపెద్ద నిర్ణయమని"కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి అన్నారు.

MP Komatireddy On Alliance With Left Parties : 'వామపక్షాలు 4 సీట్లు అడిగాయి.. పొత్తులపై ఇవాళ క్లారిటీ వస్తుంది.. రేపు రెండో జాబితా విడుదల'

Komatireddy Rajagopal Reddy Join Congress on October 27th :కాంగ్రెస్​లో ఉన్నప్పుడు నాయకత్వం, కొన్ని విషయాల్లో మాత్రమే రేవంత్​ రెడ్డితో విభేదించానని.. అంతే తప్ప మరే విషయంలోనూ ఎలాంటి విభేదాలు లేవని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అయితే పార్టీ కోసం, ప్రజల కోసం ఒక మెట్టు దిగుతానని రేవంత్​ రెడ్డి కూడా అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో నియంత పాలన అంతం కావాలన్నదే తన లక్ష్యమని.. ఈ పాలనపై పోరాటానికి అందరూ కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ ద్వారా మాత్రమే కేసీఆర్​ దుర్మార్గపు పాలన అంతం అవుతుందని ప్రజలు అంటున్నారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ బీఆర్​ఎస్​కు మళ్లీ ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. బీఆర్​ఎస్​, బీజేపీ ఒక్కటే అనే నినాదం ప్రజల్లో బలంగా ఉందని ఆరోపించారు.

"మళ్లీ మునుగోడు నుంచి నేనే పోటీ చేస్తాను. ఎల్బీనగర్​లో కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉందని చెప్పి అక్కడ పోటీ చేయమన్నారు. కానీ నేను ఎక్కడ కూడా ఎల్బీనగర్​ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. పదవి ఉన్నా లేకున్నా.. మునుగోడు ప్రజలతోనే ఉంటా.. మునుగోడులోనే పోటీ చేస్తా. మునుగోడులో రాజగోపాల్​ రెడ్డి ఓడిపోలేదు.. నైతిక విజయం సాధించాడు. కాంగ్రెస్​ అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్​లో కేసీఆర్​ను ఓడిస్తాను. దమ్ముంటే కేసీఆర్​ మునుగోడులో పోటీ చేయు.. లేకుంటే నేనే గజ్వేల్​లో పోటీ చేస్తా."- కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే

Telangana Assembly Election 2023 :దేశంలో అన్ని రంగాల అభివృద్ధిలో నంబర్​ వన్​గా ఉంటున్నామని బీఆర్​ఎస్​ నేతలు అంటున్నారు కదా.. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ అవినీతిలో మాత్రమే నంబర్​వన్​గా ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ఆరోపించారు. ఇందుకోసమే తెలంగాణ సమాజం మరోసారి ఆత్మగౌరవం కోసం పోరాడుతోందని స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ ఉద్యమద్రోహులే కీలక పదవుల్లో ఉన్నారని.. ఉద్యమకారులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కాంగ్రెస్​ పార్టీలో ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షు పదవులు ఎవరికైనా వస్తాయని.. బీఆర్​ఎస్​లో మాత్రం అధ్యక్ష పదవి ఇతరులకు ఎప్పుడూ రాదని దుయ్యబట్టారు.

Rajagopal Reddy To Join Congress : బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. ఈనెల 27న సొంత గూటికి

BJP Reaction on Rajagopal Reddy Resignation : 'బీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీ కాదు.. రాజగోపాల్ రెడ్డి అనుకుంటే పోటీ కాకుండా పోతుందా..?'

Last Updated : Oct 25, 2023, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details