Komatireddy Rajagopal Reddy Counter to Kavitha ఎమ్మెల్సీకవిత ట్వీట్‌పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా.. అంటూ ట్విట్టర్ వేదికగా కవితను ఉద్దేశించి రాజగోపాల్‌రెడ్డి ట్వీట్ చేశారు. ''నువ్వు మద్యం స్కాంలో ఉన్నది నిజం.. జైలుకెళ్లడం ఖాయం. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. మునుగోడు ఉపఎన్నికలలో నాపై విషప్రచారం చేశారు. అవినీతి మయమైన మీ కుటుంబం జైలుకెళ్లడం ఖాయం.'' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
''నిన్ను, మీ అన్న, మీ నాయనను ఎవ్వరూ కాపాడలేరు. ఇంకా మీ టీఆర్‌ఎస్ నాయకులు మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయంలో నాపై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు... రాబోయే రోజుల్లో అవినీతి మయమైన మీ కుటుంబం అంతా జైలుకి వెళ్లడం ఖాయం'' - ట్విట్టర్‌లో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈడీ ఛార్జిషీట్లో లిక్కర్ క్వీన్(లిక్కర్ రాణి) పేరును ఈడీ 28 సార్లు ప్రస్తావించింది అంటూ ట్వీట్ చేశారు. మరో వైపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మణిక్కం ఠాగూర్ కూడా స్పందిస్తూ.. కవిత చాలా వివరణలు ఇవ్వాల్సి ఉందంటూ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలు తనపై చేస్తోన్న ట్వీట్ల దాడికి ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
రాజగోపాల్ అన్నా తొందర పడకు.. మాట జారకు అంటూ కవిత హితవు పలికారు. తన పేరు ఎన్నిసార్లు చెప్పించినా.. అబద్ధం నిజం కాదంటూ ట్వీట్ చేశారు. 28 సార్లు కాదు 28 వేల సార్లు చెప్పించినా గెలిచేది నిజమేనని కవిత వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన నిందలన్నీ బోగస్ అని, తప్పని కవిత తోసిపుట్టారు. కవిత చాలా వివరణలు ఇవ్వాల్సి ఉందంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మణిక్కం ఠాగూర్ చేసిన ట్వీట్‌పై ఆమె స్పందించారు. తనపై వచ్చిన నిందలన్నీ బోగస్, అవాస్తవమన్న కవిత.. తన నిబద్ధతను కాలమే నిరూపిస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్.. బీజేపీ రైతు వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూల విధానాలను ఎండగడుతున్నందుకే మా నాయకులను భయపెట్టాలని సూచిస్తున్నారని ట్విట్టర్ వేధికగా వెల్లడించారు.
ఇవీ చదవండి: