తెలంగాణ

telangana

ETV Bharat / state

'కుమురం భీం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం' - కుమురం భీం వర్ధంతి వేడుకలు 2020

కుమురం భీం 80వ వర్ధంతి వేడుకలు హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు. మన్యం ముద్దుబిడ్డ కుమురం భీం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని సినీ నిర్మాత అల్లాని శ్రీధర్ కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులు కాలరాస్తున్నాయని... ఇలాగే కొనసాగిస్తే ఆయన బాటలోనే నడుస్తామని గిరిజన ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు వివేక్ వినాయక్ హెచ్చరించారు.

komaram bheem death anniversary in hyderabad
'కుమురం భీం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం'

By

Published : Oct 31, 2020, 3:07 PM IST

మన్యంవీరుడు కుమురం భీం పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని సినీ నిర్మాత అల్లాని శ్రీధర్ కొనియాడారు. నీరు, భూమి, భుక్తి కోసం ఎంతో పోరాటం చేసిన మహా వీరుడు కుమురం భీం అని పేర్కొన్నారు. ఆదివాసీల కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప వీరుడు అని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను కాలరాస్తున్నాయని... పాలకులు ఇదే విధానం కొనసాగిస్తే... ఆయన బాటలోనే నడిచి హక్కులను సాధించుకుంటామని గిరిజన ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు వివేక్ వినాయక్ హెచ్చరించారు. ఆయన 80వ వర్ధంతిని గిరిజన ఐక్య వేదిక, ఉద్యోగుల సంఘం హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు.

ట్యాంక్ బండ్​పై కుమురం భీం విగ్రహానికి గిరిజన ఐక్య వేదిక నాయకులు, సినీ నిర్మాత అల్లాని శ్రీధర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు సర్వేశ్వర రెడ్డి, జస్టిస్​ నర్సింహారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి:ఉట్నూరులో కుమురం భీంకు వర్ధంతిన ఘన నివాళి

ABOUT THE AUTHOR

...view details