పేదలు ఆత్మగౌరవంతో మౌలిక సదుపాయాలు, వసతులు ఉన్న ఇళ్లలో జీవించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కొల్లూర్-2లో నిర్మించిన రెండు పడక గదుల సముదాయానికి పట్టణ నిరుపేద గృహాలు, మౌలిక వసతుల పథకం కింద జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు లభించింది.
డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు జాతీయ స్థాయి పురస్కారం - తెలంగాణకు జాతీయ అవార్డు
పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్ల పంపిణీ పథకానికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. కొల్లూర్-2లో నిర్మించిన రెండు పడక గదుల సముదాయానికి పట్టణ నిరుపేద గృహాలు, మౌలిక వసతుల పథకం కింద జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు లభించింది.
double bedroom
ఈ అవార్డును శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హడ్కో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ జాయింట్ జనరల్ మేనేజర్ మురళికృష్ణ చేతుల మీదుగా జీహెచ్ఎంసీ హౌసింగ్ విభాగం ఓఎస్డీ సురేశ్‌కుమార్ అందుకున్నారు. అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని బల్దియాకు అందజేశారు.
ఇదీ చూడండి:ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్
Last Updated : Nov 6, 2020, 8:30 PM IST