తెలంగాణ

telangana

ETV Bharat / state

నాన్న, తాతను చంపేస్తారంట... జగన్​కు చిన్నారి లేఖ! - ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​

తమ కుటుంబానికి న్యాయం చేయమని కోరుతూ ఓ చిన్నారి ముఖ్యమంత్రి జగన్​కు ఉత్తరం రాసింది. ఇప్పడు ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఈ చిన్నారి బాధ విన్నాక కంటతడి పెట్టకుండా ఉంటారా!

By

Published : Sep 14, 2019, 10:10 AM IST

Updated : Sep 14, 2019, 10:19 AM IST

ఈ చిన్నారి బాధ విన్నాక కంటతడి పెట్టకుండా ఉంటారా!

తమ గ్రామంలో జరుగుతున్న అన్యాయంపై.. చిన్నారి మనసు చలించింది. సమస్యనుంచి ఎలా బయటపడాలో, ఏం చేయాలో తెలియక ముఖ్యమంత్రికే లేఖ రాసింది. సమస్యను ఉన్నదున్నట్టు వివరిస్తూ తమను కాపాడాలని కోరింది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని కోడూరి పుష్ప తమ సమస్యను ముఖ్యమంత్రి మాత్రమే తీర్చగలరని భావించి ఈ పని చేసింది.

అసలు విషయం...

మాజీ ఎంపీటీసీ, వైకాపా నాయకుడు కోడూరు వెంకటేశ్వర్లుతో... గ్రామ పెద్దలకు ఓ భూ విషయంలో 3 నెలల క్రితం వివాదం మొదలైంది. తనను ఊరి నుంచి అకారణంగా బయటకు పంపేశారంటూ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర్లు, జులై 22న కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం అధికారులు గ్రామానికి వెళ్లి పెద్దలకు నచ్చజెప్పి ఆగస్టు 28న బాధితుడిని స్వస్థలానికి పంపారు. వారం క్రితం గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. వెంకటేశ్వర్లు మనవరాళ్లు, మనుమడు.. ముగ్గురు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వారు బడికి వస్తే తమ పిల్లలను స్కూలుకు పంపేది లేదంటూ గ్రామ పెద్దలు ప్రధానోపాధ్యాయుడిని హెచ్చరించారు. వారి పిల్లలను పాఠశాల నుంచి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యపై చలించిన చిన్నారి పుష్ప.. ఈ సామాజిక బహిష్కరణపై ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాసింది. సమస్యను పరిష్కరించాలని కోరింది. ఇప్పుడు సీఎం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నదే.. చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి:

పెద్దల వివాదం...పాఠశాలకు విద్యార్థులు దూరం

Last Updated : Sep 14, 2019, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details