కార్మికులు తమ జీతాలు పెంచుమని కోరడం లేదని... ఆర్టీసీ సంస్థను బతికించమని కోరుతున్నారని తెజస అధ్యక్షుడు ప్రొ. కోదండరాం తెలిపారు. హైదరాబాద్ సరూర్నగర్లో నిర్వహించిన సమరభేరిలో పాల్గొన్న కోదండరాం... ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా చేయని విధంగా సమ్మె జరుగుతుందని పేర్కొన్నారు. సభ నిర్వహించుకోవాలంటే కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వల్లే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్లు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు న్యాయస్థానం అండగా నిలిచిందన్నారు. కార్మికులకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతుగా నిలిచాయని భరోసా ఇచ్చారు.
ఆర్టీసీ సమ్మెకు అన్నివర్గాల మద్దతు: కోదండరాం
ఏదైనా సభ నిర్వహిస్తే తమ బస్సుల్లో లక్షల మందిని తరలించే ఆర్టీసీ కార్మికులు... ప్రస్తుతం వారి సభ కోసం తరలిరావాల్సి వచ్చిందని తెజస అధ్యక్షుడు ప్రొ. కోదండరాం తెలిపారు. హైదరాబాద్ సరూర్నగర్లో నిర్వహించిన సభలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కార్మికులకు తోడుగా అన్ని పార్టీలు, సంఘాలు వచ్చాయన్నారు.
KODHANDARAM FIRE ON CM KCR FOR TSRTC STRIKE AT HYDERABAD