తెలంగాణ

telangana

ETV Bharat / state

చనిపోయిన వ్యక్తిపై దుష్ప్రచారాలు తగదు: కోడెల కుమార్తె - kodela daugher emotional words

కోడెల మరణంపై దుష్ప్రచారాలు చేస్తున్నారని కోడెల కుమార్తె విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

kodela daugher emotional words

By

Published : Sep 16, 2019, 9:19 PM IST

కోడెల శివప్రసాదరావు అకాల మరణంపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. తమ ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని కోడెల శివప్రసాద్ భార్య తెలిపారు. తన తండ్రి మృతిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని కోడెల కుమార్తె విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిపై తప్పుడు ప్రచారాలు తగదన్నారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి తన తండ్రిపై వేధింపులు మొదలయ్యాయని విజయలక్ష్మీ తెలిపారు. కంటినిండా నిద్ర లేకుండా మూణ్నెళ్లుగా తన తండ్రిని వేధించారని ఆమె ఆరోపించారు. కనీసం ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా అవమానించారన్నారు. తాను, తన సోదరుడు శివరాంపై తీవ్రమైన దుష్ప్రచారాలు చేస్తున్నారని విజయలక్ష్మీ కన్నీటిపర్యంతమయ్యారు.

చనిపోయిన వ్యక్తిపై దుష్ప్రచారాలు తగదు: కోడెల కుమార్తె

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details