కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మరణ వార్తతో యావత్ రాష్ట్రం దిగ్భ్రాంతి చెందిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. జైపాల్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్రలో జైపాల్ రెడ్డిది కీలక అధ్యాయమన్నారు. ఆయన వాస్తవ రాజకీయాలను నమ్మే వ్యక్తని అన్నారు. ఎన్నికలకు ముందు తన ఆరోగ్యంపై తనతో చర్చించేవారని వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి వివరించారు. రాజకీయ విషయాల్లో ఎవైనా అనుమానాలుంటే... తనలాంటి వారికి ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పేవారని చెప్పారు. అలాంటి ఓ పెద్ద దిక్కు మనందరినీ విడిచి వెళ్లడం చాలా బాధకరమని తెలిపారు.
'ఇన్నాళ్లు తోడుగా ఉన్న పెద్ద చెట్టు కూలిపోయింది' - JAIPAL REDDY
జైపాల్ రెడ్డి హఠాన్మరణం విషాదకరమని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ఆయనలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం ఎంతో అవసరమని... కానీ ఆయన లోకాన్ని వీడటం జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు.

'ఇన్నాళ్లు తోడుగా ఉన్న పెద్ద చెట్టు నేడు కూలిపోయింది'
'ఇన్నాళ్లు తోడుగా ఉన్న పెద్ద చెట్టు నేడు కూలిపోయింది'
ఇవీ చూడండి: జైపాల్‌రెడ్డికి పలువురు నేతల సంతాపం