తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైఎస్ ఓటు బ్యాంక్​ను కొల్లగొట్టడానికే సమావేశం' - తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై కోదండరెడ్డి

ముఖ్యమంత్రులు కేసీఆర్ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడానికి కృషి చేస్తున్నారని మండిపడ్డారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి.

Kodandareddy
ముఖ్యమంత్రుల సమావేశంపై కోదండరెడ్డి

By

Published : Jan 13, 2020, 4:31 PM IST


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌లు అధికారులు లేకుండా ప్రత్యేకంగా సమావేశం కావడంలో మతలబేంటని ప్రశ్నించారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. రాష్ట్రంలో ఉన్న వైఎస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే సీఎంలిద్దరూ సమావేశమయ్యారని ఆరోపించారు.

తెరాస మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు వ్యవస్థలన్నింటినీ.. నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల సంఘాన్ని స్వేచ్ఛగా పనిచేయనీయడం లేదని ఆక్షేపించారు. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో సర్కార్ వైఫల్యం చెందిందని విమర్శించారు. తెరాసకు ముకుతాడు వేసేందుకు ప్రజలు ఆలోచించాలని కోదండరెడ్డి కోరారు.

ముఖ్యమంత్రుల సమావేశంపై కోదండరెడ్డి

ఇవీ చూడండి: ప్రగతిభవన్‌లో.. తెలుగురాష్ట్రాల సీఎంల భేటీ

ABOUT THE AUTHOR

...view details