ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని కిసాన్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు పథకంలో స్పష్టతలేదన్నారు. వ్యవసాయ వృద్ధి రేటు 6.5 శాతం అన్నారని కానీ రైతుల ఆదాయం, ఎంఎస్పీ అసలు పెరగలేదని కోదండరెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మిగులు భూములు, ప్రజల ఆస్తులు అమ్మడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.
'తెలంగాణ బడ్జెట్ పైన పటారం లోన లొటారం'
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. పైన పటారం లోన లొటారం మాదిరిగా ఉందని కాంగ్రెస్ కిసాన్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు.
'తెలంగాణ బడ్జెట్ పైన పటారం లోన లొటారం'