రేపటి సడక్ బంద్ ఎట్టిపరిస్థితుల్లో ఆగకూడదని.. స్థానిక ఆర్టీసీ బస్‌డిపోలలో కార్మికులు యథావిధిగా సడక్ బంద్‌ను నిర్వహించాలని తెజస అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పరామర్శించారు. చికిత్సకు ఆయన సహకరించడం లేదని గంటగంటకూ ఆరోగ్యం క్షీణిస్తుండడం వల్ల బలవంతంగా సెలైన్స్ ఎక్కిస్తున్నామని వైద్యులు అన్నారని చెప్పారు. ఇలానే కొనసాగితే వారి ప్రాణాలకే ప్రమాదం అని వీలైనంత తొందరగా ఆర్టీసీ ఐకాస దీనిపై చర్యలను తీసుకోవాలని ఆయన కోరారు. ఏది ఏమైనా ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
రేపటి సడక్ బంద్‌ని జయప్రదం చేయాలి: కోదండరామ్ - kodandaram visited aswathamareddy latest
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని తెజస అధ్యక్షుడు కోదండరామ్ పరామర్శించారు. రేపు సడక్ బంద్‌ను యథావిధిగా స్థానిక ఆర్టీసీ బస్‌డిపోల వద్ద కార్మికులు కొనసాగించాలన్నారు.
అశ్వత్థామరెడ్డిని పరామర్శించిన కోదండరామ్