తెలంగాణ

telangana

ETV Bharat / state

KODANDARAM: ఓటమి తప్పదనే భయంతోనే మోదీ వెనక్కి తగ్గారు: కోదండరాం - తెలంగాణ వార్తలు

పోరాడితే ఏదైనా సాధ్యమనే విషయాన్ని రైతులు నిరూపించారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) అన్నారు. కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాల రద్దును స్వాగతిస్తున్నామని తెలిపారు. భాజపా ఆధిపత్యానికి గండి పడుతోందన్న విషయాన్ని మోదీ గ్రహించే వెనక్కి తగ్గారని పేర్కొన్నారు.

KODANDARAM
KODANDARAM

By

Published : Nov 19, 2021, 3:22 PM IST

సాగు చట్టాల రద్దును స్వాగతిస్తున్నామని తెజస అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) అన్నారు. రైతులు ఐక్యంగా నిలబడి సాగు చట్టాల సమస్యను (Farm laws India) పరిష్కరించారని తెలిపారు. పోరాడితే ఏదైనా సాధ్యమనే విషయాన్ని నిరూపించారని పేర్కొన్నారు. భాజపా ఆధిపత్యానికి గండి పడుతోందన్న విషయాన్ని మోదీ గ్రహించే వెనక్కి తగ్గారని... హైదరాబాద్‌ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో(Kodandaram news) వెల్లడించారు. వచ్చే ఏడాది రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాగు చట్టాలు దెబ్బతీసే ప్రమాదం ఉందని భావించే మోదీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. మద్దతు ధరల కోసం చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు.

ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలని సూచించిన కోదండరాం(Kodandaram news)... పరిష్కారం చూపాల్సిన వారే నిరసన తెలిపి చేతులు దులుపుకోవటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రైతు సమస్యలపై చర్చించాలని కోరారు. వరి సాగు చేయొద్దని బెదిరించటాన్ని ఖండించిన కోదండరాం... త్వరలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల్లో భరోసా నింపుతామని స్పష్టం చేశారు.

358 రోజులు సాగిన రైతుల పోరాటం...

వ్యవసాయంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మూడు కొత్త సాగు చట్టాలను(new farm laws) తీసుకొచ్చింది. అయితే, ఈ చట్టాల వల్ల కనీస మద్దతు ధర దక్కకుండా పోతుందని, కార్పొరేట్ల చేతుల్లో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యతిరేకత మొదలైంది. 'రైతు వ్యతిరేక చట్టాల'ను రద్దు చేయాలని(Farm laws repealed) డిమాండ్​ చేస్తూ 2020 నవంబర్ 26న దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు(Farmers protest) దిగారు అన్నదాతలు. తమ పోరాటాన్ని విస్తృతం చేస్తూ కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చారు. పలు దఫాలుగా చర్చలు చేపట్టినా.. రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు.

దాదాపు ఏడాది తర్వాత(2021 నవంబర్ 19) జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM modi news) సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.రైతుల పోరాటం(Farmers protest against farm laws) ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పక తప్పదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. పోలీసుల అరెస్టులు, హింసాత్మక ఘటనలు జరిగినా.. వెన్నుచూపకుండా ఏడాది కాలంగా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:కొత్త సాగు చట్టాల రద్దు.. రైతులకు మోదీ క్షమాపణలు

Farm laws India: సాగు చట్టాల రద్దు.. వ్యూహాత్మకమా? వెనక్కి తగ్గడమా?

ABOUT THE AUTHOR

...view details