తెలంగాణ

telangana

ETV Bharat / state

రామలింగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోదండరాం - ఎమ్మెల్యే సోలిపేట కుటుంబానికి కోదండరాం పరామర్శ

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని టీజేఎస్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించి, నివాళులు అర్పించారు. ఆయనతో పనిచేసిన అనుభవాలను గుర్తుతెచ్చుకున్నారు. 2008 ఎన్నికల సమయంలో సైతం అతని కోసం ప్రచారం చేశామని కోదండరాం తెలిపారు.

Kodandaram visits the Ramalinga Reddy family at siddipet district
రామలింగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోదండరాం

By

Published : Aug 12, 2020, 4:02 PM IST

రామలింగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోదండరాం

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని టీజేఎస్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించి నివాళులు అర్పించారు. మిత్రుడు రామలింగారెడ్డి మృతి తీరని లోటని కోదండరాం అన్నారు. వారి కుటుంబానికి ఆత్మస్థైర్యం చేకూరాలని కోరారు. తానూ మానవ హక్కుల కోసం పోరాటం చేసే సమయంలో రామలింగారెడ్డి జర్నలిస్టుగా పనిచేశారని ఆయన గుర్తుతెచ్చుకున్నారు.

జర్నలిస్ట్​పై జరుగుతున్న దాడులను ఆపి ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. అలా ఏర్పడిన పరిచయం తెలంగాణ ఉద్యమం ఏర్పడిన తర్వాత బాగా పని చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా కోఆర్డినేటర్ తోడుపుణురి వెంకటేశం, టీజేఎస్ జిల్లా నాయకులు నీరుడి స్వామి, దేవరాయ ఎల్లం ప్రవీణ్ కుమార్, స్వామి, ఎంపీటీసీ రాంరెడ్డి, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: కేటీఆర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details