తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ దినోత్సవం ఇప్పటి నుంచి మొదలైంది కాదని జేఎసీ ప్రారంభమైన నాటి నుంచే ఈ విమోచన దినోత్సవాన్ని జరుపుతున్నామని ఆయన అన్నారు.
"సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినంగా తెలంగాణ జన సమితి జరుపుకుంటుంది. ఇది కేవలం సైనిక చర్య వల్ల జరిగిన విలీనం కాదు. నిజాం ప్రభుత్వం పట్టుకోల్పోయిన రోజుగా చెప్పవచ్చు. ఆ తర్వాత జరిగిన సైనిక చర్యతో తెలంగాణ భారతదేశంలో విలీనం అయింది. దేశంలో విలీనం అయిన తర్వాత కూడా తెలంగాణ తన సంప్రదాయాలను వదులుకోలేదు. ప్రభుత్వాలు బాధ్యతలు మరచిన నేపథ్యంలో అప్పటి ప్రజాస్వామిక విలువలు, పోరాటాలు ఐక్యంగా తీసుకుని ప్రజలు ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను."