కరోనా వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కారానికి...తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం నిరసన దీక్ష చేపట్టారు. కోదండరాంకు పూలమాల వేసి దీక్షను ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు ప్రారంభించారు. ఈ దీక్షకు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం 4 గంటల వరకు కోదండరాం దీక్ష చేయనున్నారు.
వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది: కోదండరాం రాష్ట్రంలో కరోనా వల్ల తలెత్తిన సమస్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్...నైతిక బాధ్యత వహించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి 7వేల 500 రూపాయల ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర వనరులను కోవిడ్ నిర్మూలనకు ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం బాధ్యతతో ప్రజల బతుకును నిలబెట్టాలని... వారి బతుకుదెరువును కాపాడాలని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగేవరకు పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని కోదండరాం హెచ్చరించారు.
రాష్ట్రంలోని తప్పిదాలకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దే: కోదండరాం ఇదీ చూడండి:రక్త పరీక్షతో కరోనా వైరస్ తీవ్రత అంచనా!