తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త కమిటీని ఏర్పాటు చేసిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేయాలి: కోదండరాం

Kodandaram On TSPSC Paper Leak Issue: తెలంగాణ రాష్ట్ర పేపర్ లీకేజీ వ్యవహారంపై పార్టీలకు అతీతంగా పోరాట కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. ఈ కమిటీలో అన్ని పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఉంటారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. తక్షణమే కమిషన్ కమిటీని తొలగించి కొత్త కమిటీని ఏర్పాటు చేసిన తరువాతనే ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Kodandaram On TSPSC Paper Leak Issue
Kodandaram On TSPSC Paper Leak Issue

By

Published : Apr 2, 2023, 6:40 PM IST

కొత్త కమిటీని ఏర్పాటు చేసిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేయాలి: కోదండరాం

Kodandaram On TSPSC Paper Leak Issue: టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాలను పల్లీ బఠానీల్లా అమ్ముకున్నారని అఖిల పక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాయకులు ఆరోపించారు. విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు చేసే పోరాటాలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలవాలని పలువురు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.

నాంపల్లి మదీనా ఎడ్యుకేషనల్ సోసైటీలో టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ-ప్రభుత్వ వైఫల్యం అన్న అంశంపై కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ప్రో పీఎల్‌ విశ్వేశ్వర్ రావు, ప్రొఫెసర్ ఖాసీం, గద్దర్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఇద్దరే తప్పు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. రాజశేఖర్‌, ప్రవీణ్‌ల వెనుక పెద్ద తలకాయలున్నాయని వారు ఆరోపించారు.

Kodandaram Participated in the Round Table Meeting: పేపర్‌ లీకేజీ వ్యవహారంపై ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటైనట్లు ప్రత్యేక ఐక్య కార్యాచరణ రూపొందించి పోరాటం సాగించాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా.. సీఎం కేసీఆర్‌ బయటకు రాకపోవడం దురదృష్టకరమని తెలిపారు. బోర్డును పూర్తిగా రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రాల వ్యవహారంపై పార్టీలకు అతీతంగా పోరాట కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కోదండరాం ప్రకటించారు.

కొత్త కమిటీని ఏర్పాటు చేశాకే ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఈ కమిటీలో అన్ని పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న కోదండరాం.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. తక్షణమే సర్వీస్‌ కమిషన్‌ కమిటీని తొలిగించి కొత్త కమిటీని ఏర్పాటు చేసిన తరువాతనే ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు భరోసా కల్పించేట్లుగా గ్రామగ్రామానికి వెళ్లి కమిషన్‌ భాగోతంపై వివరించాలని తెలిపారు.

ఎవరి నేతృత్వంలో దొంగతనం జరిగిందో, వాళ్లే పరీక్షలు ఎట్లా జరుపుతారు.. జరపటానికి వీళ్లేదు. వాళ్లను తీసేయండి, కొత్త కమిటీ వేసి జరపండి అని.. దీర్ఘ కాలిక ప్రక్షాళన కోసం ఎక్వైరీ కమిషన్ వేసి ప్రక్షాళన చేయమని అడుగుతున్నాం. పిల్లలకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలి. ఇప్పటివరకు టీఎస్​పీఎస్సీ 54 వేల పోస్టులు అడ్వాటైజ్​మెంట్ ఇచ్చింది. 35 వేలు భర్తీ చేసింది. -కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు

టీఎస్​పీఎస్సీపై సర్కార్ స్పందించాలి: హైదరాబాద్‌లో ఒక పెద్ద ధర్నా కార్యక్రమాన్ని చేద్దామని సూచించారు. భావసారూప్యం కలిగిన నేతలను మాత్రమే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించినట్లు టీఎస్​పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై ఏర్పాటైన కాంగ్రెస్‌ ఉద్యమ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి స్పష్టం చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయాలనీ నిర్ణయం తీసుకున్నామన్న ఆయన తక్షణమే టీఎస్​పీఎస్సీపై తెలంగాణ సర్కార్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి.. వెంటనే ఛైర్మన్​, సభ్యులను తొలగించేలా తీర్మాణం చేసి గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్​కు పంపాలన్నారు. తాము కూడా సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి లేఖ రాస్తామని ఆయన వివరించారు. నిరుద్యోగుల పక్షాన కోదండరాంను ముందుపెట్టి పోరాటం చేద్దామని మల్లు రవి వెల్లడించారు. నిరుద్యోగ పోరాట జేఏసీగా ఛైర్మన్ కోదండరాం ఉంటారని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగులంతా కదలి రావాలని ప్రజా గాయకుడు గద్దర్‌ తెలిపారు. అరెస్టయిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉండి.. భరోసా ఇవ్వడంతోపాటు లీకేజ్ వ్యవహారంపై అందరికి తెలియాలన్న ప్రజా గాయకుడు గద్దర్‌.. దీనిని ప్రజా ఉద్యమంగా మారుద్దామని అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details