Kodandaram Fires on BRS: బీఆర్ఎస్ పాలనలో ఆంక్షలు, భయం చూశామని, ఇప్పుడు తల మీద భారం తగ్గినట్లు అయిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. కాంగ్రెస్ నెల రోజుల పాలన బాగుందని కితాబిచ్చారు. ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, నాలుగో తేదీన జీతాలు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి ప్రజలతో మమేకమై పని చేస్తున్నారన్నారని హర్షం వ్యక్తం చేశారు.
Kodandaram Comments on BRS: ప్రజలు సీఎంను కలిసి సమస్యలు చెప్పుకుంటూ సాంత్వన పొందుతున్నారని కోదండరాం (Telangana Jana Samithi President Acharya Kodandaram) సంతోషం వ్యక్తం చేశారు. దిల్లీలో కూడా ఒక మార్పు తీసుకురావాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరారు. నియంతృత్వ పోకడలే అధికారం కోల్పోవడానికి కారణమని బీఆర్ఎస్ నేతలు గుర్తించలేకపోతున్నారని మండిపడ్డారు.
ఉద్యోగులంతా సమర్ధంగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచిపేరు : కోదండరాం
"బీఆర్‌ఎస్ ఓటమి కారణం నియంతృత్వ పాలన. ఇది అర్ధం చేసుకోకుండా ప్రస్తుత పాలనను తూట్లు పొడిచేలా నాయకులు ప్రవర్తిస్తున్నారు. పైసలు ఇచ్చైనా కుట్రలు పన్నైనా మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధోరణిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలపై ఆలస్యం చేస్తోంది. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ సరిగా జరగలేదని చెప్పారు. మిగిలిన విభజన హామీలు, సమస్యలపై ఇవాళ కరపత్రం విడుదల చేశాం."- కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు
తెలంగాణ విభజల హామీలు పూర్తిగా నెరవేరే వరకు పోరాటం చేస్తాం కోదండరాం కేసీఆర్ పాలనలో రెవెన్యూ శాఖ ఛిన్నాభిన్నం అయింది : ప్రొ.కోదండరాం
Kodandaram Released Pamphlet on Telangana Problems : తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీ తప్పు పట్టారని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కోదండరాం అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ మీద ఇంకా నిర్ణయం కాలేదని దుయ్యబట్టారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ(Kazipet Railway Wagon Factory)కి శంకుస్థాపన చేశారని విమర్శించారు. విభజన హామీలు పూర్తిగా అమలు కాలేదని కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్ర వివక్షను తెలియజేసేందుకు రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ పరిరక్షణ కోసం తమ పార్టీ నిలబడి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన హామీల అమలు - కేంద్ర ప్రభుత్వ వివక్షతపై రాష్ట్ర సదస్సు గోడ పత్రికలు, కరపత్రాలను కోదండరాం పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు.
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చాల్సిందే: కోదండరాం