తెలంగాణ

telangana

Kodanda ram: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారు: కోదండరాం

By

Published : Oct 8, 2021, 4:53 AM IST

కాంగ్రెస్ తలపెట్టిన జంగ్ సైరన్ కార్యక్రమంలో గాయపడిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమీర్ జావెద్​ను తెజస అధ్యక్షుడు కోదండరాం పరామర్శించారు. విద్యార్థి యువజనులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రశ్నించే గొంతుకను అణచివేస్తూ నియంతలాగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

Kodandaram  meet the State Vice President of the Youth Congres
Kodandaram meet the State Vice President of the Youth Congres

ప్రశ్నించే గొంతుకను అణిచి వేస్తూ నియంతలాగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాగ్రాహానికి గురికాక తప్పదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీ కోసం యూత్ కాంగ్రెస్ తలపెట్టిన జంగ్ సైరన్ కార్యక్రమంలో విద్యార్థి యువజనులపై పోలీసులు లాఠీఛార్జీని కోదండరాం తీవ్రంగా ఖండించారు. లాఠీచార్జీలో గాయపడిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమీర్ జావెద్‌ను హైదరాబాద్‌ లిబర్టీలోని అతని నివాసంలో పరామర్శించారు. నీళ్లు నిధులు నియామకాలపై ఏర్పడ్డ తెలంగాణలో వాటి గురించి కొట్లాడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్క నిరసనకారుడిపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ తలపెట్టిన భారత్ బంద్​లో భాగంగా తనపై కూడా పోలీసులు విచక్షణ మరచి ప్రవర్తించారని తెలిపారు. నీళ్లు నిధులు నియామకాలపై ఏర్పడ్డ తెలంగాణలో వాటి గురించి కొట్లాడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. పోలీసులు తమపై కక్ష్యపూరితంగా లాఠీ ఛార్జ్​ చేశారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమీర్ జావిద్ తెలిపారు. ఉద్యోగాలు కల్పించే వరకూ రాష్ట్ర ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని... విద్యార్థి యువజన నాయకులపై జరిపిన లాఠీచార్జ్​పై హైకోర్టు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:Congress Jung Siren: ఉద్రిక్తంగా కాంగ్రెస్ జంగ్ సైరన్... నేడు నిరసనలకు పీసీసీ పిలుపు

ABOUT THE AUTHOR

...view details