తెలంగాణ

telangana

ETV Bharat / state

రంగారెడ్డి జిల్లాలో భూసేకరణపై కోదండరాం అభ్యంతరం - తెజస

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తెజస అధ్యక్షుడు కోదండరాం కలిశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్​లో రైతులు, గ్రామస్థుల సమ్మతి లేకుండానే భూసేకరణ చేస్తున్నారని సీఎస్​ దృష్టికి తీసుకువచ్చారు.

​​​​​​​ సీఎస్​ జోషిని కలిసిన తెజస అధ్యక్షుడు కోదండరాం

By

Published : Jul 19, 2019, 7:51 PM IST

బహుళజాతి సంస్థల కోసం పేదల భూములను అన్యాయంగా లాక్కొంటున్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. షాబాద్​ మండలంలో పరిశ్రమల స్థాపన కోసం జరుగుతున్న భూసేకరణపై సీఎస్​ జోషికి కోదండరాం ఫిర్యాదు చేశారు. గ్రామస్థులను సంప్రదించకుండానే భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల వద్ద తక్కువ ధరకు స్థలాలు తీసుకొని, టీఎస్​ఐఐసీ ఎక్కువ ధరకు పరిశ్రమలకు విక్రయిస్తోందని కోదండరాం ఆరోపించారు.

ప్రస్తుతం సచివాలయం సకల సౌకర్యాలతో అందరికి అందుబాటులో ఉందని తరలింపు, కూల్చివేత ప్రక్రియను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

​​​​​​​ సీఎస్​ జోషిని కలిసిన తెజస అధ్యక్షుడు కోదండరాం

ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details