ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమిస్తామన్నా... ప్రభుత్వం ఎటూ తేల్చక మొండిగా వ్యవహరిస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని తెజస నాయకులు ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కోర్టు తీర్పుపై గౌరవం ఉంచి సమ్మె విరమించిన కార్మికులకు పార్టీ శ్రేణులు, పౌరసమాజం మద్దతుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆచార్య కోదండరాం హామీ ఇచ్చారు.
'ఆర్టీసీ కార్మికులకు పౌరసమాజం మద్దతుగా నిలవాలి' - professor KODANDARAM latest news
ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం మెుండిగా వ్యవహరిస్తోందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. ప్రజారవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసి, కార్మికుల పొట్టలు కొట్టే దుర్మార్గానికి ప్రభుత్వం ఒడిగట్టిందని ఆరోపించారు.
TJS president KODANDARAM fairs on TRS Government today news