మేడ్చల్ బస్ డిపో ఎదురుగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ధర్నాలో పాల్గొన్నారు. ఆయన వెంట ఆర్టీసి జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 49 వేల కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని కోరారు. ఆర్టీసిని ప్రైవేటు పరం చేయడం ఎవరికి సాధ్యం కాదన్నారు. ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు కష్టపడి సంస్థను అభివృద్ధి చేశాడని పేర్కొన్నారు. ఈనెల 9న మిలియన్ మార్చ్ కార్యక్రమంలో ప్రతి కార్మికుడు పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలపాలని కోరారు.
ఆర్టీసీకి మద్దతుగా మేడ్చల్ డిపో వద్ద కోదండరామ్ ధర్నా - latest news of tsrtc workers with the support of kodandaram
మేడ్చల్ బడ్ డిపో ఎదురుగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెజసా అధ్యక్షుడు కోదండరామ్ ధర్నాలో పాల్గొన్నారు. ఈనెల 9న మిలియన్ మార్చ్ కార్యక్రమంలో ప్రతి కార్మికుడు పాల్గొని నిరసన తెలపాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.
ఆర్టీసీకి మద్దతుగా మేడ్చల్ డిపో వద్ద కోదండరామ్ ధర్నా