హైదరాబాద్ నాంపల్లిలో తెరాస భవన్లో సమావేశమైన అఖిలపక్ష నాయకులు పలు అంశాలపై చర్చించారు. ప్రతిపక్షాలు ఏం చేయాలన్నా... సీఎంకు లాక్‌డౌన్ నిబంధనలు గుర్తుకొస్తాయి.. కానీ అధికార పార్టీ చేస్తే మాత్రం గుర్తుకురావని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతురాజ్యం ముసుగులో రాచరిక పాలన సాగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ బెదిరింపులకు భయపడం : కోదండరాం - కోదండరాం ప్రభుత్వ విధానాలను విమర్శించారు తాజా వార్త
తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ప్రభుత్వ బెదిరింపులకు లొంగబోమని తెజస పార్టీ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. అఖిలపక్ష నాయకులు ఏం చేయాలన్నా... లాక్‌డౌన్ ఆంక్షలు గుర్తొస్తాయి కానీ అధికారపార్టీ నాయకులు చేయాలంటే అవేమీ గుర్తుకురావని ఆయన విమర్శించారు.

ప్రభుత్వ బెదిరింపులకు భయపడము: కోదండరాం
ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఐక్యంగా పనిచేస్తామని.. తాము ప్రభుత్వ బెదిరింపులకు భయపడం అని స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల మేరకు కరోనా పరీక్షలు చేయాలన్నారు. అసంఘటిత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాలు మొదలవడం వల్ల ప్రజలు పెద్దఎత్తున బయటకు వస్తున్నారని కోదండరాం అన్నారు. రెడ్జోన్లలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని... పేదల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ బెదిరింపులకు భయపడము: కోదండరాం