రాష్ట్రంలో వైద్యం అంతా ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోయిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. రాష్ష్రంలో మొత్తం 31,600 ఆక్సిజన్, ఐసీయూ పడకలు ఉంటే 9,500 మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని.. మిగతా 22,000 ప్రైవేటు ఆసుపత్రుల నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించేందుకు జీవో తెచ్చిన్పటికీ అమలు కావడంలేదని అన్నారు. ముఖ్య నాయకులందరికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో పెట్టుబడులు ఉండటం వల్లే ఇది సాధ్యపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'ముఖ్య నాయకులందరికి ప్రైవేటు ఆస్పత్రుల్లో వాటాలున్నాయి..'
రాష్ట్రంలో చికిత్స విధానంపై ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు గుప్పించారు. వైద్యం అంతా ప్రైవేటు రంగంలోకే వెళ్లిపోయిందని దుయ్యబట్టారు. ముఖ్య నాయకులందరికీ ప్రైవేటు ఆస్పత్రుల్లో పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు.
ప్రభుత్వం నియంత్రించలేకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ నాలుగు దిక్కులా దవాఖానాలు, ప్రతి జిల్లాలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెడతామని కేసీఆర్ ప్రకటించారు తప్పితే అమలు మాత్రం జరగలేదని దుయ్యబట్టారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ప్రభుత్వం వైద్యం మీద అతి తక్కువ ఖర్చు చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.