అమ్ముకోవాలనుకునే వారికి, ప్రజారవాణా వ్యవస్థగా ప్రజల సంక్షేమం కోసం నడుపుకోవాలనుకునే వాళ్లకి మధ్య ఘర్షణగా ఆర్టీసీ సమ్మెను అర్థం చేసుకోవాలని ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ జనసమితి కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఆర్టీసీ సమ్మె- అవలోకనం కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవడానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె చేస్తోందన్నారు. కార్మికుల సమ్మెకు అన్ని వర్గాల వారు మద్దతివ్వాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. ప్రజలను, తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను పువ్వులు ఇచ్చి.. సమ్మెకు మద్దతు ఇచ్చేలా ఆర్టీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేయాలని పేర్కొన్నారు.
అమ్ముకోవాలనుకునే వారికి... నడుపుకోవాలనుకునే వారికి మధ్య ఘర్షణ - తెజస కార్యాలయంలో రౌెండ్ టేబుల్ సమావేశం
బస్సు విలువ కారు ఉన్నోడిని అడిగితే ఏం తెలుస్తది. పారా, తాపీ పట్టుకుని రోజూ బస్సెక్కె కూలీని అడిగితే తెలుస్తది బస్సు విలువ. ఆర్టీసీ బస్సులో ఉద్యోగానికి వెళ్లే మహిళ, బడికి వెళ్లే పిల్లగాడు, కళాశాలకు వెళ్లే అమ్మాయిని అడగండి ఆర్టీసీ బస్సు లేకపోతే ఏమవుతుందని. ---- రౌండ్ టేబుల్ సమావేశంలో ఆచార్య కోదండరాం
ఆచార్య కోదండరాం